
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి కణంమెట్ట దగ్గర జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన వారు క్యాబ్ లో తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం ముగించుకొని తిరిగి చెన్నై వెళ్తుండగా నగరి కణంమెట్ట దగ్గర రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును క్యాబ్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని నగరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు