
అమరావతి: ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం (మే 19) తెల్లవారుజూమున నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదం కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.