
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలైన ముగ్గర్ని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనం బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం రఘోతంపల్లికి చెందిన వెంకటరెడ్డి… భార్య, ఇద్దరు బంధువుల పిల్లలతో బైక్ పై పెళ్లికి వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వెంకట్ రెడ్డితో పాటు చిన్నారి సౌమ్య అక్కడికక్కడే మృతి చెందగా…. వెంకట్ రెడ్డి భార్య కవిత, మరోచిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బొలెరో వాహనం డ్రైవర్ కు కూడా దెబ్బలు తగిలాయి.