
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జులై 08) గరిడేపల్లి మండలం కితవారిగూడెంలో అర్థరాత్రి ఊరు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రాక్టర్లు, కారు ఢీ కొట్టడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది.
ప్రమాదంలో గాయపడ్డ వారిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.