ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

ఓవర్ లోడ్​.. అతివేగం.. రాంగ్​ రూట్​ డ్రైవింగ్​. .. నిబంధనలు పాటించకపోవడం..  గుంతల రోడ్లు, ప్రమాదకక మలుపులు..  వెరసి ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.  మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో ప్రైవేట్​ ట్రావెల్స్​ ప్రమాదం ఆనవాళ్లు చెరిగిపోకముందే.. హైదరాబాద్​.. తాండూర్​ రోడ్డులో మరో ఘోర ప్రమాదం జరిగింది.

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ( నవంబర్​ 3)   రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్​ లో  18, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 2  మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం కంకర ఓవర్​ లోడ్​ టిప్పర్​.. బస్సు ప్రయాణికుల ప్రాణాలను తీసింది.  రాంగ్​రూట్​ లో ఎదురగా..  అతివేగంగా వచ్చిన టిప్పర్​ ఢీకొనడంతో  బస్​ దాదాపుగా 50 అడుగులు వెనక్కు వెళ్లింది.  బస్సులో  ప్రయాణికులపై కంకర రాళ్లు పడటంతో ఎక్కడి వారు అక్కడే 19 మంది మృతి చెందారు.  14 మంది  గాయపడ్డారు. మృతుల్లో  వీకెండ్​ హాలిడేస్​ ముగించుకొని ఉద్యోగాలకు వెళ్లేవారు.. విద్యార్థులు ఎ క్కువుగా ఉన్నారు.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సిస్టర్స్​ ప్రాణాలు విడిచారు.

ఇప్పటి వరకు  ( నవంబర్​ 11.30 గంటలకు) గుర్తించిన మృతుల వివరాలు

  •  దస్తగిరి బాబా-బస్సు డ్రైవర్
  •  తారిబాయ్ (45)- దన్నారమ్ తండా
  •  కల్పన (45)- బోరబండ
  •  బచ్చన్ నాగమణి (55)- భానూరు
  • ఏమావత్ తాలీబామ్- దన్నారమ్ తండా
  •  మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్
  •  గుర్రాల అభిత (21)- యాలాల్
  •  గోగుల గుణమ్మ- బోరబండ
  •  షేక్ ఖలీద్ హుస్సేన్- తాండూరు
  • తబస్సుమ్ జహాన్- తాండూరు
  • ముగ్గురు అక్కాచెల్లెళ్లు ( నందిని, తనూష, సాయి ప్రియ)

క్షతగాత్రులు..

  •  వెంకటయ్య
  •  బుచ్చిబాబు-దన్నారమ్ తండా
  •  అబ్దుల్ రజాక్-హైదరాబాద్
  •  వెన్నెల
  •  సుజాత
  •  అశోక్
  •  రవి
  •  శ్రీను- తాండూరు
  •  నందిని- తాండూరు
  •  బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
  •  ప్రేరణ- వికారాబాద్
  •  సాయి
  •  అక్రమ్-తాండూరు
  • అస్లామ్-తాండూరు

కంకర టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్‌.. అదుపు తప్పి బస్సుపై బోర్లా  పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.