లారీని ఢీ కొట్టిన స్కార్పియో.. నలుగురు అక్కడికక్కడే మృతి

లారీని ఢీ కొట్టిన స్కార్పియో.. నలుగురు అక్కడికక్కడే మృతి

జోగులాంబ గద్వాల  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర  నేషనల్ హైవేపై ముందు వెళ్తున్న లారీని స్కార్పియో ఢీ కొట్టింది.  ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. 

నంద్యాల జిల్లా  ఆళ్లగడ్డ నుంచి  స్కార్పియో వాహనంలో  ఏడుగురు  హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.