వికారాబాద్ జిల్లా యాలాలలో ఘటన.. పోలీసులమని చెప్పి చైన్ స్నాచింగ్

వికారాబాద్ జిల్లా యాలాలలో ఘటన.. పోలీసులమని చెప్పి చైన్ స్నాచింగ్

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. యాలాల మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు గోపాల్ రెడ్డి, కమల బైక్​పై తాండూర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, విశ్వనాథ్​పూర్ గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చి పోలీసులమని వారిని అడ్డగించి మాటల్లో పెట్టారు.  

ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు మరో బైక్​పై వచ్చి కమల మెడలోని 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనపై బాధితులతో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.