Uttarakhand : ఇండ్లు, రోడ్లకు పగుళ్లు.. ప్రజల్లో టెన్షన్

Uttarakhand : ఇండ్లు, రోడ్లకు పగుళ్లు.. ప్రజల్లో టెన్షన్

భూకంపం  రాలేదు..ఏం కారణమో తెలియదు..కానీ ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. ఉత్తరాఖండ్లో ఇండ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జోషిమఠ్లో ఎటు చూసినా బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. సింగ్ ధార్ వార్డులోని ఓ ఆలయం కుప్పకూలింది. గోడలకు పగుళ్లు రావడంతో ఎప్పుడు ఏ ఇళ్లు కూలిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

అకస్మాత్తుగా రోడ్లకు పగుళ్లు, భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జోషిమఠ్లోని 600 కుటుంబాలను ప్రత్యేక హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు భూమి అకస్మాత్తుగా కుంగిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. అటు సీఎం పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ను సందర్శించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను మాట్లాడిన ఆయన..వారికి భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన..సమస్యకు గల కారణం, పరిష్కారం ఆలోచించాలని ఆదేశించారు. 

జోషిమఠ్- మలారీ రోడ్‌ భారత్, చైనా సరిహద్దుని కలిపే భూభాగం. అయితే జోషిమఠ్‌ సెసెమిక్ జోన్‌ Vలో ఉంది. V జోన్ అంటే  భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలున్న ప్రాంతం. దీంతో ఆ జోన్ను భూకంపాల రావడానికి అవకాశమున్న జోన్గా  పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం అలాంటి భూకంపాలు ఏవీ రాలేదు కానీ.. వాతావరణంలో వచ్చిన మార్పులు ఇందుకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు.