
పండగ రోజే ఓ షోరూంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలు దొంగలు సుమారు రూ. 40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో నేషనల్ హైవేపై ఉన్న రిలయన్స్ డిజిటల్ షోరూంలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి షాపు మూసి వెళ్లిన సిబ్బంది.. శనివారం ఉదయం వచ్చి షోరూం ఓపెన్ చేసి లోపలికి వెళ్లగా సెల్‌ఫోన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దాంతో షోరూం సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. షోరూంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. పండగ రోజు గిరాకీ ఎక్కువగా ఉంటుందని తొందరగా షాపు ఓపెన్ చేద్దామనుకున్న సిబ్బందికి దొంగలు షాక్ ఇచ్చారు. నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న షోరూంలోనే దొంగలు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
For More News..