ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షలు దోచుకుంటున్నరు

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షలు దోచుకుంటున్నరు

హైదరాబాద్ సిటీలో రోజు రోజుకీ పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని మాయమాటలతో నమ్మించి అందినంత దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సాప్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు కాజేస్తున్నారు.

హైదరాబాద్ లో నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన నిరుద్యోగుల రెజ్యూమ్స్ డేటా సేకరించి చీటింగ్ చేస్తున్నారు. అర్హతలు, ఆసక్తిని బట్టి సాప్ట్ వేర్, MNCల్లో కొలువులు అంటూ నిరుద్యోగులకు ఫోన్లు చేస్తున్నారు.  మంచి ప్యాకేజీ ఇప్పిస్తామని బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.  ప్రైవేటే కాదు... ప్రభుత్వ కొలువులు కూడా ఇప్పిస్తామంటూ లక్షలు దోచుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి... ప్రాసెసింగ్ ఫీజులు, అపాయింట్ మెంట్ లెటర్ ఖర్చులు అంటూ వసూళ్ళకి పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు నెలల్లోనే 1 కోటి 13 లక్షల వరకూ కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.

ఫేక్ జాబ్స్ కోసం కంపెనీలను పోలిన ఫేక్ వెబ్ సైట్లు కూడా తయారు చేస్తున్నారు కేటుగాళ్ళు. జాబ్ పేరుతో వచ్చే కాల్స్  నమ్మొద్దంటున్నారు సైబర్ ఎక్స్ పర్ట్స్.  కంపెనీ నుంచి వచ్చే మెయిల్స్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. జాబ్ పేరుతో డబ్బులు అడిగితే అది ఫ్రాడ్ అంటున్నారు సైబర్ నిపుణులు నరసింహారావు. ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని ఫోన్ చేస్తే వారి మాటలు నమ్మొద్దంటున్నారు పోలీసులు. నిరుద్యోగులు కన్సల్టేన్సీలను అప్రోచ్ అయ్యే ముందు దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఉద్యోగం కోసం డబ్బుల ప్రస్తావన వచ్చిందంటే... అది సైబర్ నేరగాళ్ల పనే అని అనుమానించాలంటున్నారు పోలీసులు.  వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం