కిలో వెండి రూ.6 లక్షలు అవుతుందా.. నిజమేనా ఇది.. ఈ అంచనాను నమ్మొచ్చా..?

కిలో వెండి రూ.6 లక్షలు అవుతుందా.. నిజమేనా ఇది.. ఈ అంచనాను నమ్మొచ్చా..?

ప్రముఖ ఇన్వెస్టర్, పెట్టుబడి నిపుణులు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసారీ ఇటీవల తన క్రిప్టో పెట్టుబడులను లిక్విడేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో సంచలన బాంబు పేల్చారు. అదే చరిత్రలో ఇప్పటి వరకు చూడని అతిపెద్ద క్రాష్ రాబోతోందని చెప్పారు. ఈసారి కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదని ఆసియా, యూరప్ దేశాలు కూడా క్రాష్ వల్ల భారీగా దెబ్బతిననున్నట్లు ఎక్స్ పోస్టులో వెల్లడించారు. 

2013లో తన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ లో పేర్కొన్న క్రాష్ ప్రస్తుతం వచ్చేసిందని. మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న ఒత్తిడి కేవలం ఆర్థిక వ్యవస్థల్లోని పరిస్థితుల వల్ల వచ్చింది కాదని చెప్పారు రాబర్ట్. వేగంగా విస్తరిస్తున్న ఏఐ దీనికి ప్రధాన కారణంగా ఆయన చెబుతున్నారు. ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మారుతున్న పరిస్థితులకు సిద్ధంగా లేని సమయంలో ఊహించని వేగంతో విస్తరిస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. ఇది సాంప్రదాయ ఉద్యోగాలను కనుమరుగు చేస్తోందన్నారు. 

ALSO READ : ఈ కాలం కుర్ర ఉద్యోగులు ఎలా ఉన్నారో చూడండీ.. 

ఈ సమయంలో వెండి ఇన్వెస్టర్లకు మంచి రాబడిని తెచ్చిపెట్టగలదని రాబర్ట్ కియోసాకీ చెబుతున్నారు. ప్రస్తుతం ఔన్సు వెండి రేటు 50 డాలర్లుగా ఉందని త్వరలోనే ఇది 70 డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు. అలాగే 2026 పూర్తయ్యే నాటికి కేజీ వెండి రేటు ఔన్సుకు 200 డాలర్లు అవుతుందని అంచనా వేశారు. అంటే కేజీ వెండి రేటు 2026 చివరి నాటికి ఈ లెక్కన రూ.6 లక్షలు క్రాస్ చేస్తుందన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ఇతర పెట్టుబడులు నష్టాలను చూస్తున్నప్పుడు వెండి ఇన్వెస్టర్లు లాభాలను అందుకుంటారని రాబర్ట్ కియోసాకీ చెబుతున్నారు. 

రానున్న కాలంలో ఏఐ కారణంగా జాబ్ మార్కెట్ క్రాష్, ఆఫీస్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ క్రాష్ తప్పవని అన్నారు. దీంతో ప్రాపర్టీలకు డిమాండ్ ఉండదని.. ప్రజల ఆదాయం కూడా పడిపోతుందని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో డిజిటల్ అసెట్స్ అంటే బిట్ కాయిన్ లాంటి క్రిప్టోలతో పాటు బంగారం, వెండికి మాత్రమే నిజమైన విలువ ఉంటుందని ప్రజలు ఇప్పటికైనా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని రాబర్ట్ కియోసాకీ చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే కొన్ని నెలల్లో స్టాక్ మార్కెట్ల పతనం ఉంటుందా అనే భయాలు చాలా మందిలో మెుదలవుతున్నాయి.