ఈ కాలం కుర్ర ఉద్యోగులు ఎలా ఉన్నారో చూడండీ.. సెలవు ఇలా అడుగుతారా అంటూ బాస్ పోస్ట్ వైరల్

ఈ కాలం కుర్ర ఉద్యోగులు ఎలా ఉన్నారో చూడండీ.. సెలవు ఇలా అడుగుతారా అంటూ బాస్ పోస్ట్ వైరల్

కుర్రోల్లోయ్.. కుర్రోళ్లు.. ఈ కాలం కుర్రోళ్లు ఉద్యోగం అంటే లెక్క లేదు.. ఉద్యోగం అంటే భయం అంతకన్నా లేదు.. ఈ రెండూ లేనప్పుడు బాస్ అంటే మాత్రం భయం ఉంటుందా ఏంటీ.. ఎలా ఉంటుంది.. జనరేషన్ జెడ్ ఉద్యోగులు  ఆలా ఇలా లేరు.. నచ్చితే చేస్తారు.. నచ్చకపోతే మానేస్తారు.. ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు అంటారా.. ఢిల్లీలో ఓ కంపెనీలో పని చేస్తున్న జనరేషన్ జెడ్ ఉద్యోగి.. లీవ్ కావాలని వాట్సాప్ లో మెసేజ్ చేశాడు.. ఇదే ఇప్పుడు వైరల్ అయ్యింది. నాకు కళ్లు మండుతున్నాయ్.. ఇవాళ ఆఫీసుకు రాను.. ఇది వాట్సాప్ లీవ్ మెసేజ్.. 

కంపెనీ యజమానికి ఈ మెసేజ్ చాలా సూటిగా ఉండటంతో ఆయన దాన్ని 'X'లో షేర్ చేసారు. కొద్దిసేపట్లోనే ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. దింతో  ఈ కాలంలో యువత ఎంత సూటిగా ఉంటారో నవ్వుకోగా.. కొందరైతే ఈ మాటలకు సపోర్ట్ కూడా చేసారు. ఈ మెసేజ్‌లో పెద్దగా వివరణ లేదు, సెలవు కావాలని కూడా అడగలేదు. కేవలం ఉన్నది చెప్పాడు. దానికి కంపెనీ యజమాని 'సరే' అని వెంటనే రిప్లయ్ కూడా ఇచ్చాడు. 
 
ఈ పోస్ట్ చూసిన చాలా మంది రకరాలుగా కామెంట్లు చేశారు. కొందరైతే అది 'ఆర్డర్' కాదని ఆరోగ్య సమస్యను చెప్పడం అని అనగా... కొందరు Gen Z స్టైల్ బాగుందని, వాళ్ళు అబద్దం చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారని మెచ్చుకున్నారు. మెసేజ్ సూటిగా ఉన్నా తప్పు లేదని యజమాని శ్రీవాస్తవ్ కూడా ఒప్పుకొని... "అవును, ఇది మంచిదే! నాకు క్లారిటీ అంటే ఎక్కువ ఇష్టం!" అని రిప్లయ్ చేసారు.