ఇది మాకు దక్కిన గొప్ప వరం

ఇది మాకు దక్కిన గొప్ప వరం

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. అతని భార్య శీతల్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ పాపకు ట్రినిటీ థియా అని పేరు పెట్టారు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను పంచుకుంటూ ఊతప్ప తన గారాల పట్టిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులం అయినందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నాం’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు ఊతప్ప.

దీనితో క్రికెటర్లతో పాటుగా అభిమానులు  ఊతప్ప  దంపతులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. 2016లో శీతల్‌ను పెళ్లాడిన ఊతప్పకు ఇప్పటికే నీల్‌ నోలన్‌ ఊతప్ప అనే కుమారుడు  ఉన్నాడు. శీతల్ బెంగళూరుకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.