AI Treatment: రోబోలే ఇక్కడ డాక్టర్లు.. 21 రకాల జబ్బులకు వైద్యం

AI Treatment: రోబోలే ఇక్కడ డాక్టర్లు.. 21 రకాల జబ్బులకు వైద్యం

రోబో సినిమాలో ఒక ప్రెగ్నెంట్​ లేడీకి చిట్టి రోబో పురుడు పోసే సీన్​ అందరూ చూసే ఉంటారు.  అలాంటివి ఒకప్పుడు ఫిక్షన్​ సినిమాల్లోనే సాధ్యమయ్యేవి. కానీ.. ఇకనుంచి నిజ జీవితంలో కూడా చూడొచ్చు. వైద్య రంగంలో ఏఐ పాత్ర రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్నో రకాల ట్రీట్​మెంట్లలో ఏఐని వాడుతున్నారు. ఇప్పుడు సంప్రదాయ వైద్య విధానాలకు స్వస్తి పలికి పూర్తిగా ఏఐ టెక్నాలజీతోనే నడిచే ప్రపంచంలో మొదటి హాస్పిటల్​ అందుబాటులోకి వచ్చింది. 

చైనాలో ఏజెంట్​ పేరుతో ప్రారంభించిన ఈ హాస్పిటల్​లో చాట్‌‌‌‌జీపీటీ 3.5 టెక్నాలజీని ఉపయోగించుకుని రోబోలే ట్రీట్​మెంట్​ చేస్తాయి. ఇందులో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులతోపాటు, పల్మనాలజీ, కార్డియాలజీ సహా 21 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ​ఏఐతో ట్రైనింగ్​ ఇచ్చిన 14 రోబోలు ట్రీట్​మెంట్​ అందిస్తాయి. 

మానవ డాక్టర్లే కాదు.. నర్సులు, రిసెప్షనిస్టులు కూడా లేరు. ప్రస్తుతం ఈ హాస్పిటల్​లో రోజుకు 3,000 కంటే ఎక్కువ మందికి చికిత్స అందించేలా ప్లాన్​ చేశారు. ఇందులో డాక్టర్ల కోసం గంటల తరబడి వెయిట్​ చేయాల్సిన అవసరం లేదు. రోగ నిర్ధారణ విషయంలో చాలా కచ్చితత్వం ఉందని చెప్తున్నారు. మనుషులు అందించే చికిత్సల కచ్చితత్వం 82-85 శాతం ఉండగా, ఏఐ డాక్టర్లు 93 శాతం కచ్చితత్వంతో ట్రీట్‌‌‌‌మెంట్ చేయగలవని రీసెర్చర్లు చెప్తున్నారు.