హైదరాబాద్, వెలుగు: కొన్ని రకాల కంటి వ్యాధుల చికిత్స కోసం రోష్ ఫార్మా ఇండియా వాబైస్మో (ఫారిసిమాబ్) ఇంజెక్షన్‌ను లాంచ్ చేసింది. నియోవాస్కులర్ లేదా 'వెట్' ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డిజెనరేషన్ (ఎన్ఎంఏడీ) డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా (డీఎంఈ) అనే కంటి వ్యాధుల చికిత్స కోసం ఈ ఇంజెక్షన్వాడుతారు. దీనిని ఇండియాలోనే తయారు చేశామని కంపెనీ తెలిపింది.
వాబైస్మో (ఫారిసిమాబ్)ను జనవరి 2022లో యూఎస్ఎఫ్డీఏ ఆమోదించింది. ఇది ఇప్పుడు 90కిపైగా దేశాలలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 2 మిలియన్ల కంటే ఎక్కువ డోసులు ఇచ్చామని రోష్ తెలిపింది. కంపెనీ ధర వివరాలను వెల్లడించనప్పటికీ, మొదటి సంవత్సరం చికిత్స కో సుమారు రూ.నాలుగు లక్షల వరకు, తదుపరి సంవత్సరాలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతుందని అంచనా.
