అఫ్గాన్‌లో మళ్లీ టెర్రర్ అటాక్!

అఫ్గాన్‌లో మళ్లీ టెర్రర్ అటాక్!

అమెరికా హెచ్చరించినట్టే జరిగింది. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి టెర్రర్ అటాక్ జరిగే ముప్పు ఉందని ఈ రోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఆయన వార్నింగ్ ఇచ్చినట్టే ఆదివారం కాబూల్ ఎయిర్‌‌పోర్టు సమీపంలోని ఓ ఇంటిపై రాకెట్ లాంచర్‌‌ అటాక్ జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాంబు పేలుళ్ల శబ్ధంతో ఆ ఏరియా అంతా దద్దరిల్లింది. అయితే ఈ ఘటనలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.


కాగా, ఈ నెల 26న కాబూల్ ఎయిర్‌‌పోర్టు వద్ద  ISIS–-K జరిపిన ఆత్మాహుతి దాడి జరిపిన విషయం తెలిసిందే. అఫ్గాన్‌ను తాలిబాన్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు నుంచి తరలిస్తున్న క్రమంలో ఎయిర్‌‌పోర్టు గేటు వద్ద వందలాది మంది గుంపులుగా ఉన్న సమయంలో టెర్రరిస్టులు బాంబులు పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 169 ఆఫ్గన్ పౌరులతో  పాటు... 13 మంది  అమెరికా సైనికులు  ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన వారిపై రివేంజ్ తీర్చుకుంటామని అమెరికా స్పష్టం హెచ్చరించింది.