సిరియాలో మార్కెట్‌‌‌‌పై రాకెట్‌‌‌‌ దాడి

సిరియాలో మార్కెట్‌‌‌‌పై రాకెట్‌‌‌‌ దాడి
  • 9 మంది మృతి.. 30 మందికి గాయాలు

జిస్ర్ అల్‌‌‌‌ షుగుర్‌‌‌‌‌‌‌‌(సిరియా): నార్త్‌‌‌‌వెస్ట్రర్న్‌‌‌‌ సిరియాలోని బిజీ వెజిటేబుల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌పై ఆదివారం తెల్లవారుజామున రాకెట్‌‌‌‌ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని వైట్‌‌‌‌ హెల్మెట్‌‌‌‌ అనే పౌర రక్షణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే చాన్స్‌‌‌‌ ఉందని వెల్లడించారు. రష్యా, టర్కీ సరిహద్దు సమీపంలోని మేజర్ సిటీ జిస్ర్ అల్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్లు ఈ దాడికి చేశారని సిరియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న బ్రిటన్‌‌‌‌కు చెందిన అపోజిషన్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ మానిటర్‌‌‌‌‌‌‌‌ సిరియన్‌‌‌‌ అబ్జర్వేటరీ తెలిపింది.

నార్త్‌‌‌‌ సిరియా చుట్టూ ఉన్న చాలా మంది రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తారని, అందుకే వారు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని వివరించింది. గాయపడ్డ వారికి రక్తదానం చేయాలని వైట్‌‌‌‌ హెల్మెట్‌‌‌‌ ప్రతినిధులు పిలుపునిచ్చారు. నార్త్‌‌‌‌వెస్ట్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లోని సాయుధ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని తెలిపారు.