
‘జబర్దస్త్’ షోతో పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)’. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించగా, అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా నటించింది.
నవంబర్ 22న సినిమా విడుదల కానుందని ప్రకటించారు. డైరెక్టర్ వేణు రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసి రాకేష్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రచ్చ రవి ముఖ్య పాత్రలు పోషించారు.