
షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్ మినహా హిట్ సినిమాలు లేక బాలీవుడ్ నేల చూపులు చూస్తోంది. ఈ టైంలో అలియా భట్ రణవీర్ సింగ్‌తో నటించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్‌కహానీ’ ఇవాళ విడుదలైంది. ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
టైటిల్లో ఉన్న లవ్‌స్టోరీతో పాటుగా ఫ్మామిలీ ఎమోషన్స్‌ను కూడా పండించడంతో థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారాయి. మరో వారం ఇదే జోరు చూపిస్తే బాలీవుడ్లో మరో బిగ్ హిట్ పక్కా అంటున్నారు విశ్లేషకులు. దర్శకుడు కరణ్ జోహార్‌కు ఈ సినిమా అతిపెద్ద కంబ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఇప్పటకే ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అలియా ఒకే పాటలో 20కి పైగా చీరలు కట్టి టీజర్‌తోనే హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదలై తన నటనకు కూడా మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. ఆర్ఆర్ఆర్లో సీతగా మెరిసిన అలియాను మరో తెలుగు సినిమాలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.