భారత టెన్నిస్ దిగ్గజం.. రెండుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్న తన 20 ఏళ్ళ టెన్నిస్ కు గుడ్ బై చెప్పాడు. శనివారం లెజెండరీ ప్లేయర్ (నవంబర్ 1) అధికారికంగా ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా ఇండియాలో తిరుగులేని ప్లేయర్ గా నిలిచిన బోపన్న..గుడ్ బై చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో జాన్ పీర్స్, జేమ్స్ ట్రేసీ చేతిలో 5-7, 6-2, 10-8 తేడాతో ఓడిపోయారు. 45 సంవత్సరాల వయసులో రోహన్ బోపన్న తన టెన్నిస్ కెరీర్ ను ముగించడం విశేషం.
"నా జీవితాన్నే మార్చేసిన టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది. 20 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత.. రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని భావించాను. నా రాకెట్‌ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని భావించాను. నా ఆటను మెరుగు పరుచుకోవడానికి చేసిన సాధన.. ఇక్కడ వరకు విజయవంతమైన ప్రయాణం అంతా కలలా అనిపిస్తుంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే నాకు దక్కిన పెద్ద గౌరవం". అని రిటైర్మెంట్ తర్వాత బోపన్న ఎమోషనల్ ట్వీట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశాడు.
►ALSO READ | Shubman Gill: గిల్ నలుగురు క్రికెటర్ల కెరీర్ నాశనం చేశాడు.. టీమిండియా కెప్టెన్‌పై నెటిజన్స్ ఫైర్!
బోపన్న 2017లో గాబ్రియేలా డబ్రోవ్స్కీతో కలిసి తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఈ గ్రాండ్ స్లామ్ దక్కింది. 2023 ఇండియన్ వెల్స్ ATP మాస్టర్స్ 1000ను గెలుచుకున్నాడు. ఎబ్డెన్‌తో కలిసి 43 ఏళ్ల వయసులో మాస్టర్స్ 1000 టైటిల్‌ను గెలుచుకొని అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 2024లో ఎబ్డెన్‌తో కలిసి మయామి ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్‌తో జతకట్టి చరిత్ర సృష్టించడంతో పాటు 43 ఏళ్ళ వయసులో ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయర్‌గా నిలిచాడు.
End of an era 🎾 🇮🇳
— ESPN India (@ESPNIndia) November 1, 2025
Veteran Indian tennis star and two-time Grand Slam champion Rohan Bopanna calls time on his illustrious 20-year-career 🙌 pic.twitter.com/Fq60ySi01N
