Rohan Bopanna: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన టెన్నిస్ దిగ్గజం

Rohan Bopanna: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన టెన్నిస్ దిగ్గజం

భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు, పురుషుల డబుల్స్ వరల్డ్ నంబర్ 1 రోహన్ బోపన్నకు దేశంలో అరుదైన ఘనత దక్కనుంది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. బోపన్నతో పాటు వెటరన్ స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్పతో సహా మరో ఆరుగురు అథ్లెట్లకు ఈ అత్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.  

భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం. ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించిన వారికి పద్మశ్రీని అందజేస్తారు. కెరీర్ ఆసాంతం బోపన్న నిలకడగా రాణిస్తున్నాడు. సోమవారం ప్రకటించనున్న  ATP ర్యాంకింగ్స్‌ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 43 సంవత్సరాల వయసులో బోపన్న నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్న తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. 
   
43 ఏళ్ల బోపన్న.. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌ మిక్సడ్ డబుల్స్ విభాగంలో కెనడా భాగస్వామి గాబ్రియేలా డబ్రోస్కీతో కలిసి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 37 ఏళ్ల జోష్నా ఆసియా క్రీడల్లో పలు పతకాలను గెలుచుకుంది. 2022లో స్వర్ణంతో సహా డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలను కూడా గెలుచుకుంది. 


పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితా:

హర్బిందర్ సింగ్ (హాకీ, కోచ్)
పూర్ణిమా మహతో (ఆర్చరీ, మాజీ క్రీడాకారిణి)
సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్, అథ్లెట్)
గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్, కోచ్)
ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (మల్లఖంబ, కోచ్)
జోష్నా చినప్ప (స్క్వాష్, అథ్లెట్)
రోహన్ మచ్చండ బోపన్న (టెన్నిస్, అథ్లెట్)