
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ అదరగొడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జట్టుకు వీరిద్దరూ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు హాఫ్ సెంచరీలను కంప్లీట్ చేసుకున్నారు. 33 బంతుల్లోనే గిల్ హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ కు ఇది వన్డేల్లో 49 వ హాఫ్ సెంచరీ కాగా, గిల్ కు 6 వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. రోహిత్ (71), గిల్ (55) క్రీజులో ఉన్నారు.