టీ20లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

టీ20లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్‌లో నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో  రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 10 పరుగులు చేయగానే టీ20లో అత్యధిక పరుగులు (3,449) చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.  మొత్తం 125 ఇన్నింగ్స్‌లలో 32.10 సగటుతో రోహిత్  3,499  పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 27 అర్ధ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 118 .. శర్మ తరువాతి స్ధానాలలో మార్టిన్ గప్టిల్  (3,497), విరాట్ కోహ్లీ(3,308) ఉన్నారు. 

ఇక ఆసియా కప్‌‌లో ఇండియా బోణీ చేసింది. 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌ను చిత్తు చేసింది. ముందుగా టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పాక్‌... ‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ (42 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 43) టాప్‌‌ స్కోరర్‌‌.  భువనేశ్వర్‌‌ (4/26), పాండ్యా దుమ్మురేపారు. తర్వాత ఇండియా -19.4- ఓవర్లలో 148/5- స్కోరు చేసి గెలిచింది. విరాట్‌‌ కోహ్లీ (34 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 35), రవీంద్ర జడేజా (29 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35) రాణించారు. పాండ్యాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.