
ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో ఇన్సింగ్స్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 15 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు . భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన 8వ ఆటగాడు రోహిత్. అంతేగాకుండా అన్నిఫార్మాట్లలో ఒపెనర్ గా అత్యంత వేగంగా 11 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. 246 ఇన్నింగ్స్ లోనే రోహిత్ ఈ పరుగులు చేశాడు. సచిన్ 241 ఇన్నింగ్స్ లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.