బామ్మర్ది పెళ్లిలో రచ్చ చేసిన రోహిత్ శర్మ

బామ్మర్ది పెళ్లిలో రచ్చ చేసిన రోహిత్ శర్మ

బామ్మర్ది పెళ్లి కారణంగా భారత్- ఆస్ట్రేలియా  మధ్య  జరిగిన మొదటి వన్డేకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అయితే వన్డేకు దూరమైనా..రోహిత్ శర్మ మాత్రం పెళ్లిలో తెగ ఎంజాయ్ చేశాడు. బామ్మర్ది సంగీత్ వేడుకలో  భార్యతో కలిసి స్టెప్పులేశాడు. రోహిత్ శర్మ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియా కెప్టెన్ మంచి ఆటగాడే కాదు..మంచి డ్యాన్సర్ కూడా. అందుకే తన బామ్మర్ది పెళ్లిలో భార్య రితికతో కలిసి డ్యాన్స్ చేశాడు. రితిక సోదరుడు కునాల్ సజ్దే వివాహంలో  స్టెప్పులతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. భార్యాభర్తలు డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా రోహిత్ శర్మ ఫ్యాన్స్  ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.