ఆసియా కప్ 2023: రోహిత్ పై నెటిజన్స్ ఫైర్! ఆ విషయంలో ధోనీ సలహాలు తీసుకోమంటూ..

ఆసియా కప్ 2023: రోహిత్ పై నెటిజన్స్ ఫైర్! ఆ విషయంలో ధోనీ సలహాలు తీసుకోమంటూ..

ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ కి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్ పాకిస్థాన్ మీద రద్దు చేసుకున్న తర్వాత వరుసగా నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలు సాధించి ఆసియా కప్ గెలవడానికి మరో అడుగు దూరంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన చేస్తూ వరల్డ్ కప్ కి ఆత్మ విశ్వాసాన్ని నింపుకుంటుంది. అంతా బాగానే కెప్టెన్ గా రోహిత్ శర్మ డీఆర్ఎస్ విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. అసలు రోహిత్ శర్మ పదే పదే ఈ తప్పు ఎందుకు చేస్తున్నాడు? 

రాహుల్ ని పట్టించుకోకుండా.. 

జట్టుకి డీఆర్ఎస్ ఎంత ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఓవర్ల మ్యాచులో కేవలం రెండే రివ్యూలు ఉంటాయి కాబట్టి వాటిని వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. ఈ మ్యాచ్ 12 ఓవర్లో కుల్దీప్ వేసాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఒక అద్భుతమైన బంతిని వేయగా..అసలంక డిఫెన్సె ఆడాడు. అయితే బంతి విపరీతంగా టర్న్ కావడం వలన అది కాస్త ఫస్ట్ స్లిప్ లో ఉన్న రోహిత్ చేతిలో పడింది. 

బంతి బ్యాట్ అంచుకు తగిలిందని భావించిన కుల్దీప్.. అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్‌కు వెళ్లమని రోహిత్ శర్మను కుల్దీప్ ఒప్పించేందుకు ప్రయత్నం చేసాడు. అయితే వికెట్ కీపర్ KL రాహుల్ తల బంతి ఎడ్జ్ తీసుకోలేదని.. రివ్యూ వద్దని చెప్పాడు. కానీ రోహిత్ మాత్రం రాహుల్ మాట లెక్క చేయకుండా రివ్యూకి వెళ్లగా అది నాటౌట్ గా తేలింది. గతంలో కూడా అనవసరంగా  డీఆర్ఎస్ విషయంలో తప్పులు చేసిన రోహిత్ మూల్యం చెల్లించుకున్నాడు.

జట్టుని ముందుండి నడిపిస్తున్న రోహిత్.. డీఆర్ఎస్ విషయంలో తప్పులు చేయడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ విషయంలో కాస్త ధోనీ సలహాలు తీసుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు. మరి రోహిత్ ఈ సారైనా డీఆర్ఎస్ విషయంలో జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.