MI vs PBKS Clash: నేడు ( 2026, ఏప్రిల్ 16న) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇరు జట్లు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై (MI) తీవ్రంగా కష్టపడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుతమైన గెలుపులని నమోదు చేసుకున్నాయి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.
ఈ కీలక పోరు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకి మరో షాక్ తగిలింది. రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న అతను నేటి మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ అందుబాటులో లేకపోతే, ముంబై జట్టు డానిష్ మలేవార్ లేదా రాబిన్ మింజ్ లాంటి యువ ఓపెనర్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రోహిత్ విషయంలో ఎలాంటి రిస్క్ చేయొద్దని ఆలోచనలో ఎంఐ యాజమాన్యం ఉంది. చివరి మ్యాచుల్లో అతడి పాత్ర అత్యంత కీలకమైనదిగా భావిస్తుంది.
గత సీజన్ క్వాలిఫైయర్– 2లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44), నమన్ ధీర్ (37) రాణించారు. అయితే, పంజాబ్ కింగ్స్ తరపున శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్ (41 బంతుల్లో 87*) ఆడి, ఒక ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.
►ALSO READ | కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ రహానెకు రూ. 12 లక్షల ఫైన్
తుది జట్ల అంచనా:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్: అశ్వని కుమార్
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్

