రోహిత్ హాఫ్ సెంచరీ..భారత్ స్కోర్ 173 రన్స్

రోహిత్ హాఫ్ సెంచరీ..భారత్ స్కోర్ 173 రన్స్

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 173 రన్స్ చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలోనే  కీలకమైన 2 వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందించారు.  కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ డకౌట్ అయ్యాడు. దిల్లాన్ మధుషంక వేసిన మూడో ఓవర్ లో భారీ షాట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

కోహ్లీ ఔట్ అవడంతో 13 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్ తో స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ఆ తర్వాత  వచ్చిన పాండ్యా, పంత్ తక్కువ స్కోర్లకే ఔట్ అవడంతో భారత్ 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా, చమిక కరుణరత్నే, దసున్ షనక రెండేసి వికెట్లు తీశారు.