వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

వన్డేల్లో  రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డేల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. మాజీలు, దిగ్గజాలకు సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి వన్డేలో రోహిత్ శర్మ 76 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లున్నాయి. దీంతో వన్డేల్లో 250 సిక్సులు కొట్టిన ఏకైక భారత ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో 229 సిక్సులతో ధోని రెండో స్థానంలో..195 సిక్సర్లతో సచిన్ మూడో స్థానంలో, 190 సిక్సర్లతో గంగూలీ నాల్గో ప్లేస్ లో ఉన్నారు. 

250వ సిక్సర్..
ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే కంటే ముందు రోహిత్ ఖాతాలో 245 సిక్సర్లున్నాయి. అయితే ఓవల్లో జరిగిన మ్యాచ్లో 5వ సిక్సర్ బాదిన రోహిత్..వన్డే కెరియర్లో 250 సిక్సర్ నమోదు చేశాడు. 

ప్రపంచంలో నాలుగో స్థానం..
వన్డేల్లో వరల్డ్ వైడ్గా అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 351 సిక్సర్లతో పాక్ ప్లేయర్ అఫ్రిది ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అఫ్రిది తర్వాత 331 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండో స్థానంలో..270 సిక్సర్లతో సనత్ జయసూర్య థార్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో 229 సిక్సులతో ధోని ఐదో స్థానంలో ఉన్నాడు.