Cricket World Cup 2023: ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు.. మా వ్యూహాలు మాకు ఉన్నాయి: రోహిత్ శర్మ

Cricket World Cup 2023: ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు.. మా వ్యూహాలు మాకు ఉన్నాయి: రోహిత్ శర్మ

వరల్డ్ కప్ లో ఫైనల్ సమరానికి కౌంట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నెలలు, రోజులు పోయి ప్రస్తుతం గంటలు లెక్క పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు (నవంబర్ 19) మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ కప్ టైటిల్ కోసం పోరాడనున్నాయి. 12 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టడం.. స్వదేశంలో వరల్డ్ కప్ జరగడంతో ఈ మ్యాచ్ టీమిండియా గెలుపుపై అభిమానులు ధీమాగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు కూడా అందుకు తగ్గట్టుగానే వరుస విజయాలతో దూసుకెళ్తుంది. 

ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో గెలిచి ఆత్వ విశ్వాసంతో బరిలోకి దిగుతుంది.  మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా 8 మ్యాచ్ ల్లో గెలిచి టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాడానికి రెడీ అయిపోయింది. ఈ మెగా ఫైనల్ కు ముందు రోహిత్ మీడియాతో మాట్లాడాడు. వరల్డ్‌కప్ కోసం చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నామని, జట్టులోని ఆటగాళ్లందరికీ ఈ టోర్నీలో వారి రోల్ ఏంటనేది తెలుసని అన్నాడు.

రెండేళ్ల ముందు నుంచే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాం. మొదట టీ20, ఆ తరువాత ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్.. ఈ మూడు ఫార్మాట్లకు ఎవరెవరు సరిపోతారో ముందే గుర్తించాం. ఆటగాళ్లకు వారు పోషించబోయే పాత్ర గురించి వివరించాం” అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా టీమిండియా జర్నీ గురించి మాట్లాడాడు. ఫైనల్ వరకు చేరడమే మా మొదటి లక్ష్యం అని ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించాలో పూర్తి స్పష్టతతో పనిచేశాం. అంతా మేం అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. వరల్డ్ కప్ ఫైనల్ కు ఇదే జరుగుతుందని ఆశిస్తున్నా. అని రోహిత్ తెలిపాడు.