కోహ్లీ స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ

V6 Velugu Posted on Sep 13, 2021

టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు UAE వేదికగా ఐపీఎల్ జరగబోతోంది. దీని తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుందని బీసీసీఐ తెలిపింది.

T20 వరల్డ్ కప్ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది కోహ్లీ ఆటతీరుపై పడుతోంది. దీంతో.. ఒక ఫార్మాట్ నుంచి కోహ్లీకి ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కోహ్లీని మళ్లీ ఇందతకు ముందులా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. రానున్న రోజుల్లో టెస్ట్ జట్టులో భారీ మార్పులు జరగనున్నాయి. 

Tagged Rohit Sharma,  Team India, replace Virat Kohli, limited-overs captain post, T20 World Cup

Latest Videos

Subscribe Now

More News