IND vs ENG: లక్కీ బాయ్: విఫలమైనా అతడికి ఛాన్స్ ఇస్తాం.. క్లారిటీ ఇచ్చేసిన రోహిత్

IND vs ENG: లక్కీ బాయ్: విఫలమైనా అతడికి ఛాన్స్ ఇస్తాం.. క్లారిటీ ఇచ్చేసిన రోహిత్

సాధారణంగా భారత జట్టులో అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ రజత్ పటిదార్ కు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ అందుకోవడంలో విఫలమయ్యాడు.   దీంతో ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడిపై వేటు పడటం ఖాయంగా అనుకున్నారు. ఇదిలా ఉంటే పటిదార్ ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెనుకేసుకొచ్చాడు.
    
'రజత్ పటిదార్ చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు. నాకు అతనంటే ఇష్టం. నేను అతనిని ప్రతిభావంతుడైన ఆటగాడిగా చూస్తున్నాను. అతను జట్టులో కుదురుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలి'. అని రోహిత్ చివరి టెస్టుకు ముందు ఇంటర్వ్యూ లో అన్నాడు. కోహ్లీ, రాహుల్ గాయాలతో లక్కీగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడు ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ సిరీస్‌లో రెండో టెస్టులో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా.. 9,5, 0,17, 0 స్కోర్లు నమోదు చేశాడు.ఆడిన ఆరు ఇన్నింగ్సుల్లోనే రెండు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ ఈ ప్లేయర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రోహిత్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే పటిదార్ కు రేపు (మార్చి 7) ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ లో మరో అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.     

అశ్విన్  గురించి మాట్లాడుతూ..  ఏ ఆటగాడికైనా 100 టెస్టులు ఆడటం పెద్ద అచీవ్‌మెంట్. ఇది ఒక పెద్ద మైలురాయి. అతను మాకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. జట్టు కోసం చాలా చేశాడు. అతనికి ఏ ప్రశంసలు సరిపోవు". అని హిట్ మ్యాన్ తెలియజేశాడు.    

ALSO READ :- అశ్విన్‌కు గౌరవించడం తెలియదు.. భారత మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు

సిరీస్ విజయం గురించి మాట్లాడుతూ.. మేము ఒత్తిడికి గురైన ప్రతిసారి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అది నాకు సంతోషాన్ని కలిగించింది. సిరీస్ చివరి మ్యాచ్ లో ధర్మశాల ట్రాక్ బాగుంటుందని ఆశిస్తున్నాను అని రోహిత్ అన్నాడు.