వీడియో: గిల్‌పై రోహిత్ ఫైర్.."నీకేమైనా పిచ్చా"అంటూ..

వీడియో: గిల్‌పై రోహిత్ ఫైర్.."నీకేమైనా పిచ్చా"అంటూ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ తర్వాత అంత కూల్ గా ఉండడం రోహిత్ కే సాధ్యం అని మాజీలు కితాబులు ఇచ్చేసారు. మైదానంలో ఎంతో స్పోర్టీవ్ గా ఉండే హిట్ మ్యాన్.. బయట కూడా కోపపడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఆసియా కప్ ఫైనల్ కి ముందు రోహిత్ భారత యువ ఓపెనర్ గిల్ పై కోపం తెచ్చుకున్నాడు.

నా వల్ల కాదంటున్న రోహిత్
  
ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫైనల్లో భారత్ కాసేపట్లో శ్రీలంకతో తలపడనుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమివ్వబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు రోహిత్ గిల్ పై నోరు పారేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే..  ఒక లిఫ్టు ముందు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఏదో విషయంలో మాట్లాడుకుంటూ కనిపించారు. గిల్ ఏమి అడిగాడో తెలియదు గానీ.. రోహిత్ మాత్రం చాలా చికాకుగా బదులిచ్చాడు. నా వాళ్ళ కాదు. నీకేమైనా పిచ్చా అంటూ బదులివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియని ఫ్యాన్స్.. ఇక ఈ వీడియోతో ఆడుకోవడం మొదలు పెట్టారు. గిల్ ఏం అడిగి ఉంటాడని వాళ్లకు తోచిన సమాధానాలు చెప్తున్నారు.