చెలరేగిన రోహిత్.. న్యూజిలాండ్ టార్గెట్ 185

చెలరేగిన రోహిత్.. న్యూజిలాండ్ టార్గెట్ 185

ఈడెన్ గార్డెన్ లో జరుగుతోన్న మూడో టీ20లో  న్యూజిలాండ్ కు 185 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది భారత్. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్  ఓపెనర్లు  కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు, ఇషాన్ కిషన్ 29 పరుగులు చేయడంతో  మంచి ఓపెనింగ్ దక్కింది. పవర్ ప్లేలో 69 పరుగులు వచ్చాయి.  శ్రేయస్ అయ్యర్ 25, వెంకటేశ్ అయ్యర్ 20 పరుగులు, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. ఆఖర్లో వచ్చిన బౌలర్ దీపక్ చాహర్ 8 బంతుల్లో 21 పరుగులు  చేయడంతో భారత్ 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో  మిచెల్ సాంట్నర్ 3, బౌల్ట్, మిల్నే, ఇష్ సోధి,పెర్గ్ సన్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.