IND vs ENG, 2nd Test: రెప్పపాటులో అద్భుతం.. రోహిత్ శర్మ క్యాచ్‌కు అందరూ షాక్

IND vs ENG, 2nd Test: రెప్పపాటులో అద్భుతం.. రోహిత్ శర్మ క్యాచ్‌కు అందరూ షాక్

వైజాగ్ లో జరుగుతున్న సెకండ్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బ్యాటింగ్ లో విఫలమైనా.. ఫీల్డింగ్ లో టాప్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. మొదటి స్లిప్ లో హిట్ మ్యాన్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ ప్రస్తుతం  వైరల్ గా మారుతుంది.అశ్విన్ వేసిన 29 ఓవర్ తొలి బంతిని కట్ చేయబోయిన పోప్ అక్కడే ఫస్ట్ స్లిప్ లో ఉన్న రోహిత్ కు చిక్కాడు. రెప్పపాటులో పట్టిన ఈ క్యాచ్ కు అందరూ షాక్ అవుతున్నారు. రియాక్షన్ టైం 0.45 సెకన్స్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా ఇలాంటి క్యాచ్ లు పట్టాలంటే శరీరం సహకరించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలి.       

36 ఏళ్ళ రోహిత్ శర్మ ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని.. గ్రౌండ్ లో సరిగా ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడని విమర్శలు గుప్పించారు. అయితే స్లిప్ లో రోహిత్ అందుకున్న క్యాచ్ చూస్తే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. గతంలో రహానే స్లిప్ లో ఇలాంటి గ్రేట్ క్యాచ్ లు అందుకునే వాడు. రహానే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత కోహ్లీ స్పిన్ బౌలింగ్ కు స్లిప్ గా ఉంటున్నాడు. ప్రస్తుతం కోహ్లీ రెండో టెస్టులో ఆడకపోవడంతో ఆ బాధ్యతను రోహిత్ తీసుకొని సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. 

మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన పోప్ వికెట్ భారత శిభిరంలో ఆనందాన్ని నింపింది. రోహిత్ పట్టిన అద్భుత క్యాచ్ కు 23 పరుగులకే ఔటయ్యాడు. ఇక్క నుంచి ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. రూట్(16), క్రాలి (73), బెయిర్ స్టో(26) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. నాలుగో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.క్రీజ్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (0) ఉన్నారు.