
న్యూఢిల్లీ: క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న విన్నర్స్ పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ఐదుగురు క్రీడాకారులకు కేంద్రం ఖేల్ రత్న అవార్డులకు ఎంపిక చేసింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేశ్ ఫొగట్, టీటీ చాంప్ మనికా బాత్రా, హాకీ విమెన్స్ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, పారాలింపిక్ గోస్ట్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు ఖేల్ రత్నను గెల్చుకున్నారు. రోహిత్‌ను మినహాయిస్తే మరో క్రికెటర్, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, విమెన్ క్రికెటర్ దీప్తి శర్మలు అర్జున అవార్డులు అందుకోనున్నారు. ఈ సంవత్సరానికి అర్జున అవార్డు నెగ్గిన 27 మంది స్పోర్ట్‌పర్సన్స్ లిస్ట్‌లో ఆర్చర్ అతాను దాస్, షూటర్ మను భాస్కర్ కూడా ఉండటం గమనార్హం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత ఖేల్ రత్న గెలిచిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.