రెండో మ్యాచ్లో గెలిచి రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడా...?

రెండో మ్యాచ్లో గెలిచి రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడా...?

సౌతాఫ్రికాతో తొలి టీ20లో గెలిచి న టీమిండియా రెండో టీ20 కోసం సిద్ధమైంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గౌహతిలో  రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించనున్నాడు.  సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. 

అత్యధిక విజయాల సారథిగా రికార్డు..

ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు అందుకున్న భారత్ సారథిగా రోహిత్ శర్మ ఇప్పటికే రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. 2016లో ధోని కెప్టెన్సీలో టీమిండియా టీ20ల్లో 15 విజయాలు సాధించింది. ప్రస్తుతం రోహిత్ సారథ్యంలో టీమిండియా 2022లో 16 మ్యాచుల్లో గెలిచింది.  సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 విజయంతో రోహిత్ ఈ ఘనతను అందుకోవడం విశేషం. సౌతాఫ్రికాతో ఇంకా రెండు టీ20లు, ఆసీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..రోహిత్ శర్మ ఈ రికార్డును మరింతగా మెరుగుపర్చుకునే అవకాశాలున్నాయి. 

రోహిత్ను కలవరపెడుతున్న చెత్త రికార్డు

మరోవైపు రోహిత్ శర్మను ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో సిల్వర్ డక్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయితే టీ20ల్లో 10సార్లు డకౌట్ అయిన బ్యాట్స్మన్గా చెత్త రికార్డును మూటగట్టుకోనున్నాడు.