SRH vs MI: హైదరాబాద్‌లో మ్యాచ్.. చరిత్ర సృష్టించబోతున్న రోహిత్ శర్మ

SRH vs MI: హైదరాబాద్‌లో మ్యాచ్.. చరిత్ర సృష్టించబోతున్న రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియాలో ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలియదు గాని ఐపీఎల్ కు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే.

తొలి మూడు సీజన్ లు డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన హిట్ మ్యాన్.. 2011 నుంచి సొంత జట్టు ముంబై ఇండియన్స్ లో చేరాడు. ఇక్కడ నుంచి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెప్టెన్ గా, బ్యాటర్ గా టాప్ ముంబై జట్టును టాప్ లో నిలిపాడు. అంబానీ ఉన్నా.. సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా రోహిత్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది.

10 ఏళ్ళ నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు.ముంబై అంటే రోహిత్.. రోహిత్ అంటే ముంబై అనే విధంగా మారిపోయింది. ముంబై తరపున ఎన్నో ఘనతలు అందుకున్న రోహిత్.. నేడు (మార్చి 27) సన్ రైజర్స్ తో జరగనున్న ఐపీఎల్ మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 200 మ్యాచ్ లు పూర్తి చేసుకోబోతున్న తొలి ప్లేయర్ గా అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకోనున్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో 244 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. ముంబై తరపున 199 మ్యాచ్ ల్లో ఆడాడు. మరో 45 మ్యాచ్ లు డెక్కన్ ఛార్జర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. రోహిత్ తర్వాత స్థానంలో 189 మ్యాచ్ లతో కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు.