టాస్ గెలిచాక రోహిత్ మర్చిపోయిండు.. నవ్వులే నవ్వులు

టాస్ గెలిచాక రోహిత్  మర్చిపోయిండు.. నవ్వులే నవ్వులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాస్ గెలిచాకా? బౌలింగా? బ్యాటింగా? చెప్పలేక కాసేపు మరిచిపోయాడు. తర్వాత బౌలింగ్ అని చెప్పడంతో  అక్కడున్నవాళ్లంతా  నవ్వుకున్నారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో   వైరల్ అవుతోంది. రోహిత్ కు ఇంత మతిమరుపా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో   రోహిత్ టాస్ గెలిచిండు. బౌలింగ్ తీసుకుంటావా? బ్యాటింగా  అని రిఫరీ  జవగళ్ శ్రీనాధ్ అడిగితే రోహిత్ సమాధానం చెప్పలేక కాసేపు బుర్ర గోక్కుంటూ ఆలోచనలో పడ్డాడు. 15 సెకన్లు తర్వాత బౌలింగ్ అని చెప్పాడు. దీంతో అక్కడున్న  కామెంటేటర్ రవిశాస్త్రి, కివీస్ సారధి టామ్ లాథమ్ నవ్వారు. పక్కనే ప్రాక్టీస్ చేస్తున్న  టీమిండియా ఆటగాళ్లు కూడా రోహిత్ ప్రవర్తనను చూస్తూ నవ్వుకున్నారు.  టాస్ గెలిస్తే ఏం చేయాలనేదానిపై  టీంలో చర్చించాం కానీ కాసేపు మర్చిపోయా అంటూ రోహిత్ బదులిచ్చాడు.   ఈ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.