T20 World Cup 2024: చరిత్రలో ఇద్దరే..వరల్డ్ కప్‌లో రోహిత్, షకీబ్ అరుదైన రికార్డ్

T20 World Cup 2024: చరిత్రలో ఇద్దరే..వరల్డ్ కప్‌లో రోహిత్, షకీబ్ అరుదైన రికార్డ్

టీ20 వరల్డ్ కప్ హడావుడి ప్రారంభమైంది. రెండు నెలల పాటు ఐపీఎల్ ను చూసి ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులు ప్రస్తుతం టీ20  వరల్డ్ కప్ పై నెలకొంది. జట్లన్నీ పొట్టి సమరానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. జూన్ 2 నుంచి ప్రధాన మ్యాచ్ లతో వరల్డ్ కప్ స్టార్ అవుతుంది. ఈ వరల్డ్ కప్ కు ముందు ఇద్దరు క్రికెటర్లు ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలు అన్ని ఆడడటం విశేషం. 

2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 8 టీ20 వరల్డ్ కప్ లు ఎడిషన్ లు జరిగాయి. ప్రతి ఎడిషన్ లోనూ షకీబ్, రోహిత్  తమ జట్ల తరపున ఆడటం విశేషం. ఈ అరుదైన రికార్డ్ వీరిద్దరినీ మినహాయిస్తే మరే క్రికెటర్ కు లేకపోవడం విశేషం. ఎనిమిది ఎడిషన్లలో రోహిత్ 39 మ్యాచ్‌లలో 963 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ స్ట్రైక్ రేట్ 127.88 కాగా.. యావరేజ్ 34.39గా ఉంది. షకీబ్ 36 మ్యాచ్‌లలో బ్యాట్ తో 742 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 122.44 కాగా యావరేజ్ 23.93 గా ఉంది. ఇక బౌలింగ్ లోనూ మెరిసిన ఈ బంగ్లా ఆల్ రౌండర్ 47 వికెట్లు పడగొట్టి వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.     

Also read : T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్.. క్రికెట్ స్టేడియం ధ్వంసం

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి.