T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్.. క్రికెట్ స్టేడియం ధ్వంసం

T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్.. క్రికెట్ స్టేడియం ధ్వంసం

మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు మొదలవ్వగా.. జూన్ 2 నుంచి అసలు పోరు షురూ కానుంది. ఆ సమయం దగ్గర పడుతుండగా.. ప్రకృతి బీభత్సం సృష్టించింది. టోర్నడోలు విరుచుకుపడటంతో డల్లాస్‍లోని గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది.

టోర్నడోల వల్ల గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. భారీ వర్షం, తీవ్రమైన గాలుల వల్ల మైదానంలో ఏర్పాటు చేసిన ఓ స్క్రీన్‍ ధ్వంసమవ్వగా.. స్డేడియం పైకప్పు డ్యామేజ్ అయింది. సుమారు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఫలితంగా అమెరికా- బంగ్లాదేశ్ జట్ల మధ్య మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రపంచ కప్‌లో 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న గ్రాండ్ ప్రైరీ స్టేడియం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలపై నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. ధ్వంసమైన స్టేడియం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదే వేదికపై ​​ప్రారంభ మ్యాచ్

వాస్తవానికి గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జూన్ 2న ఉదయం 6 గంటలకు ప్రారంభ మ్యాచ్ జరగాల్సివుంది. తొలి పోరులో సహ ఆతిథ్య దేశం అమెరికా, కెనడా తలపడనున్నాయి. అనంతరం ఇదే వేదికపై జూన్ 4న నెదర్లాండ్స్ vs నేపాల్, జూన్ 6న అమెరికా vs పాకిస్తాన్, జూన్ 8న నెదర్లాండ్స్ vs నేపాల్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. దీంతో నిర్వాహకులు స్టేడియం పునరుద్ధణ పనులు మొదలు పెట్టారు.

also read : T20 World Cup 2024: భయపెడుతున్న అసోసియేట్ జట్లు.. నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి