‘పేపర్ బాయ్’ ఫేమ్ రియా కొత్త మూవీ.. దర్శకుడు విజయ్ కనకమేడల గ్రాండ్ లాంచ్

‘పేపర్ బాయ్’ ఫేమ్ రియా కొత్త మూవీ..  దర్శకుడు విజయ్ కనకమేడల గ్రాండ్ లాంచ్

రోహిత్ వర్మ, రియా సుమన్ జంటగా గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కొత్త చిత్రం ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. హీరో హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు.

మరో దర్శకుడు మల్లిఖార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, ప్రగతి, వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గోవిందరెడ్డి చంద్ర మాట్లాడుతూ ‘క్రేజీ కింగ్ ప్రొడక్షన్‌‌‌‌లో క్రేజీ కథతో రాబోతున్నాం. ఛోటా కె. ప్రసాద్, మణిశర్మ వంటి సీనియర్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది’అని చెప్పాడు.

ఈ మూవీ టైటిల్‌‌‌‌ను వినాయక చవితి రోజున ప్రకటిస్తామని నిర్మాత నజీర్ జమాల్ అన్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌కు పరిచయమవడం హ్యాపీగా ఉందని హీరో రోహిత్ అన్నాడు.  ఇందులో మంచి పాత్రను పోషిస్తున్నా అని రియా సుమన్ చెప్పింది. నటులు నిఖిల్ దేవాదుల, అక్షర పాల్గొన్నారు.

రియా సుమన్‌.. 2016లో తెలుగులో విడుదలైన 'మజ్ను' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన 'పేపర్ బాయ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.