
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును రోల్స్ రాయ్స్ లాంచ్ చేసింది. ల రోస్ నువార్ డ్రాప్టైల్ ధర రూ.246 కోట్లు (30 మిలియన్ డాలర్లు). ఈ కారులో క్లాసిక్ 6.75 లీటర్ల ట్విన్ టర్బో వీ12 ఇంజిన్ను అమర్చారు. 620 బీహెచ్పీ పవర్ రిలీజ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
వెస్పాలో జస్టీన్ బీబర్ ఎడిషన్
యూఎస్ పాప్ సింగర్ జస్టీన్ బీబర్తో కలిసి ‘జస్టీన్ బీబర్ వెస్పా ఎడిషన్’ ను పియాజియో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మొత్తం వైట్ కలర్లో ఉంది. జస్టీన్ బీబర్ ఎక్స్ వెస్పా ధర రూ. 6,45,690 (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్లో 12 ఇంచుల అల్లాయ్ వీల్స్, 150 సీసీ ఇంజిన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12.5 బీహెచ్పీ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది.