రియలిస్టిక్ విలేజ్ డ్రామా రోలుగుంట సూరి..

రియలిస్టిక్ విలేజ్ డ్రామా రోలుగుంట సూరి..

విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా  ‘రోలుగుంట సూరి’.  నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో  సౌమ్య చాందిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ   ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను నటుడు  రాజేంద్రప్రసాద్ లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు  మాట్లాడుతూ ‘ఇదొక  రియలిస్టిక్ విలేజ్ డ్రామా.  భావోద్వేగాలు, జీవిత సత్యాలతో కూడిన   ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.  

ఇలాంటి సినిమాలు గ్రామీణ జీవన శైలిని  నిజ జీవితానికి దగ్గరగా చూపిస్తాయి. ’ అని అన్నారు. బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.