టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే

టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే

టీవీఎస్​మోటార్ కంపెనీ ఈ పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తన రోనిన్ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిల్ స్పెషల్ఎడిషన్ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త గ్రాఫిక్స్​, బ్లాక్ థీమ్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాంప్​, యూఎస్​బీ చార్జర్, విజర్,  ప్రత్యేక ఈఎఫ్​ఐ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి ప్రత్యేకతలు. ఇందులోని 225.9 సీసీ ఇంజన్​ 20 బీహెచ్​పీని ఇస్తుంది. ఎక్స్ షోరూం ధర రూ.1.72 లక్షలు.

ఒప్పో సరికొత్త 5జీ ఫోన్​

చైనీస్​ స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో ఇండియా మార్కెట్లోకి ఏ79 పేరుతో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.56-అంగుళాల డిస్​ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, ముందు 8 ఎంపీ కెమెరా, వెనుక 50ఎంపీ + 2ఎంపీ కెమెరాలు, 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజీ, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ,  ఆండ్రాయిడ్ 13 ఓఎస్​ ఉంటాయి. ధర రూ.20 వేలు. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే రూ.నాలుగు వేల వరకు డిస్కౌంట్​ ఇస్తారు.

లివ్ లాంగ్ నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్స్​

హైదరాబాద్​కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ లివ్ లాంగ్ ఈ–మొబిలిటీ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్   యూఫోరియా ఎల్​ఎక్స్​, నెస్టర్​ఎస్​ఎక్స్ లను లాంచ్​ చేసింది. వీటిలో ఎల్​సీడీ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, శక్తివంతమైన ఫ్రంట్ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  నాలుగు డ్రైవింగ్ మోడ్స్​ సహా అనేక ఫీచర్లుఉ న్నాయి.  ఈ సైకిళ్లు గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. యూఫోరియా ఒక్క చార్జింగ్​కు 50 కిలోమీటర్ల వరకు, నెస్టర్​30 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.