కవిత బెయిట్ పిటిషన్ పై విచారణ వాయిదా

కవిత బెయిట్ పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన పిటిషన్లపై మే 27వ తేదీ సోమవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విచార చేపట్టింది.  కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు  వినిపించారు.

దాదాపు 40 నిముషాల పాటు వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి..  ఎమ్మెల్సీ కవితను నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపారు. అయితే, ఈడీ, సీబీఐ..  మే 28వ తేదీ మంగళవారం అన్ని ఆధారాలతో తమ వాదనలు వినిపిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణను మంగళవారానికి వాయివా వేసింది.

ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కవిత.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అనంతరం కోర్టు ప్రవేశపెట్టగా మొదట ఈడీ కస్టడీ.. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. జైల్లో ఉండగానే కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లో ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది.