- విచారణ నవంబర్8కి వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్ షీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ లో పలు పేజీల మిస్సింగ్, ఖాళీలపై ప్రతివాదులు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.
మనీశ్ సిసోడియా, అమన్ దీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రుపై సీబీఐ అదనపు చార్జ్ షీట్ వేసింది.శనివారం సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు. కవితతోపాటు సహ నిందితులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరయ్యారు.
సీబీఐ చార్జ్ షీట్ లో స్పష్టంగా లేని పలు పేజీల విషయాన్ని కవిత, సహ నిందితుల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ స్పందిస్తూ అప్ డేట్ చేసిన కాపీలు అందచేస్తామని కోర్టుకు విన్నవించారు.