Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై నేడే తీర్పు

Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై నేడే తీర్పు

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది.  అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ల బెయిల్ పిటిషన్ పై గత నెల 23న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. సాయంత్రం 4 గంటలకు కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో వీరికి బెయిల్ వచ్చినా ఈడీ కేసులో రాకపోవడంతో ప్రస్తుతం నిందితులంతా తీహార్ జైలులోనే ఉన్నారు. 

లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్లను గతేడాది నవంబర్లో అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో వీరంతా కీలకంగా వ్యవహరించారని ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ క్రమంలో నిందితులు బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరిస్తున్నందున తమ క్లయింట్లకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు అడ్వొకేట్లు కోర్టుకు విన్నవించారు. అయితే వారు బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశముందని ఈడీ వాదించింది. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.