చంద్రయాన్ 3 : రోవర్ కు తప్పిన ముప్పు.. సెన్సార్ అలర్ట్తో మారిన దిశ

చంద్రయాన్ 3 : రోవర్ కు తప్పిన ముప్పు.. సెన్సార్ అలర్ట్తో మారిన దిశ

చంద్రునిపై ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్కు పెద్ద ముప్పే తప్పింది. అధ్యయనంలో భాగంగా కదులుతున్న రోవర్.. చంద్రుని ఉపరితలంపై ఓ బిలానికి (గొయ్యి) అతి సమీపంలోకి వెళ్లింది. ప్రజ్ఞాన్ రోవర్  స్థానానికి దాదాపు 3 మీటర్లు దూరంలో 4 మీటర్ల వ్యాసం గల గొయ్యికి అతీ సమీపంలోకి వెళ్లినట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. అయితే సెన్సార్ అలర్ట్ తో రోవర్ తిరిగి యథాస్థానానికి వచ్చిందని తెలిపింది.  

దీనికి సంబంధించిన ఫొటోలను ISRO X(గతంలో ట్విట్టర్)లో పంచుకుంది. “ఆగస్టు 27, 2023న, రోవర్ దాని స్థానానికి 3 మీటర్ల దూరంలో ఉన్న 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం వద్దకు వచ్చింది. మార్గాన్ని తిరిగి పొందాలని రోవర్‌కు ఆదేశించబడింది. ఇది ఇప్పుడు సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తోంది." అని  ఇస్రో తెలిపింది. 

చంద్రుని దక్షిణ ధృవం పై విక్రమ్ ల్యాండర్ తొలి టస్క్ ను ఆదివారం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో మార్పులకు సంబంధించిన గ్రాఫ్ ను విడుదల చేసింది. చాస్ట్  పేలోడ్ తో పరీక్షించి డేటాను పంపించింది. అయితే దక్షిణ ధృవంపై నేల థర్మల్ ప్రొఫైల్ ను రికార్డు్ చేయడం ఇదే తొలిసారి అని ఇస్రో ప్రకటించింది. శివశక్తి పాయింట్ వద్ద ఉపరితలంపై 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నట్లు గ్రాఫ్ లో వెల్లడింది.