రివ్యూ: రౌడీ బాయ్స్

రివ్యూ: రౌడీ బాయ్స్

రివ్యూ: రౌడీ బాయ్స్
రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: ఆషిశ్,అనుపమా పరమేశ్వరన్,విక్రమ్ సహదేవ్,శ్రీకాంత్ అయ్యంగార్,జయ ప్రకాష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మాధి
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: మధు
నిర్మాత: దిల్ రాజు
రచన,దర్శకత్వం: హర్ష కొనుగంటి
రిలీజ్ డేట్: జనవరి 14,2022

దిల్ రాజు తన తమ్ముడు, పార్టనర్ అయిన శిరీష్ అబ్బాయి ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘‘రౌడీ బాయ్స్ ’’ సినిమా తీశాడు. కొత్త హీరోకు తగ్గట్టుగా యూత్ ఫుల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నారు మేకర్స్. కాలేజ్ బ్యాక్ డ్రాప్, రొమాంటిక్ లవ్ స్టోరి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ తీతలో కొత్తదనం కనిపించలేదు.సేమ్ రొటీన్ ట్రీట్ మెంట్ ఇచ్చి బోర్ కొట్టించారు.

కథ విషయానికొస్తే..

ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కు పడదు. ఎప్పుడూ గొడవ పడుతుంటారు. కానీ ఇంజనీరింగ్ చదువుతున్న అక్షయ్ (ఆశిష్)కు మెడికల్ కాలేజీ స్టూడెంట్ కావ్య (అనుపమ)ను లవ్ చేస్తాడు. కానీ కావ్యను విక్రమ్ (విక్రమ్) ముందే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కోసం వీళిద్దరి మధ్య గొడవ. కావ్య అక్షయ్ నే లవ్ చేస్తుంది. తర్వాత ఏమైంది. విక్రమ్, అక్షయ్ ల గొడవ సద్దుమణిగిందా లేదా అనేది కథ. 

నటన..


కొత్త కుర్రాడు ఆశిష్ ఫర్వాలేదనిపించాడు. ఇంకా బెటర్ కావాల్సి ఉంది. డాన్సులల్లో ప్రతిభ కనబరిచాడు. ఫ్యూచర్లో నిలదొక్కుకోగలడు. అనుపమ పరమేశ్వరన్ సినిమాకు ప్లస్ అయింది. అందంగా కనిపించడమే కాకుండా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. అంతే కాదు మూడు నాలుగు సార్లు లిప్ లాక్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

టెక్నికల్


టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫర్ మధు సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. హర్ష రాసుకున్న డైలాగులు ఓకే.

ఓవరాల్ గా రౌడీ బాయ్స్ ఆకట్టుకోలేకపోయింది. కొడుకును భారీగా లాంచ్ చేద్దామని బాగానే ప్రయత్నించాడు దిల్ రాజు. కానీ ప్రమోషన్ మీద పెట్టిన శ్రద్ద కథ, కథనాల వైపు పెట్టలేకపోయాడు. హుషారుతో ఆకట్టుకున్న శ్రీహర్ష రెండో సినిమాకు తడబడ్డాడు. లవ్ ట్రాక్ లో కొత్తదనం లేకుండా పోయింది. ఫస్టాఫ్ లో కాలేజ్ గొడవలు, లవ్ ప్రపోజల్స్ , డాన్సులతో టైమ్ పాస్ అయినా..సెకండాఫ్ లో బోరింగ్ సీన్లు, స్లో సాంగ్స్ తో బోర్  కొట్టించాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బాగుంటుందని ఆశతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.
 

బాటమ్ లైన్: సారీ బాయ్స్..